Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌తో అనుకున్న త్రివిక్రమ్ చిన్న సినిమా చేస్తున్నాడా..?

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (14:06 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నారు. ఎన్టీఆర్‌కు కథ చెప్పడం.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ క్రేజీ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సమ్మర్‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు.
 
అంతేనా.. ఈ సినిమాకి అయిననూ పోయిరావలే.. హస్తినకు అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే... కరోనా రావడంతో సమ్మర్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలి అనుకున్న మూవీ ఆగింది. ఆర్ఆర్ఆర్ పూర్తైన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ చేస్తారు. ఆర్ఆర్ఆర్ పూర్తి అవ్వడానికి టైమ్ పడుతుంది. 
 
అందుచేత ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు. మహేష్ బాబుతో సినిమా చేద్దామనుకున్నారు కానీ.. ఇప్పట్లో కుదరదు. కనుక నేచురల్ స్టార్ నానితో చిన్న సినిమా చేయాలి అనుకుంటున్నారట. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేస్తానని నానికి చెప్పారట. ఇప్పుడు ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తుంది. మరి.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments