టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రుద్రమదేవి. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రధారి. రాణి రుద్రమదేవి జీవితకథను ఆధారంగా చేసుకుని హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కించారు. గత 2015లో విడుదలైన ఈ చిత్రం... బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
అయితే, ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అంతంతమాత్రమేకానీ, ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. రుద్రమదేవి హిందీ అనువాద వెర్షన్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. దీనికి నిదర్శనమే రుద్రమదేవి హిందీ వెర్షన్‌కు యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే, చాలుక్య వీరభద్రుడిగా రానా నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రుద్రమదేవి చిత్రం విడుదలైంది.