Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరు..?

Advertiesment
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సర్కారు వారి పాట". 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అయితే... ఈ సినిమా తర్వాత మహేష్‌ చేయనున్న సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే... 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి మహేష్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. కానీ.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుంది.
 
అందుచేత రాజమౌళితో చేయనున్న మూవీ కన్నా ముందు మరో సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకనే మహేష్ ఇప్పుడు కథలు వింటున్నారని టాక్. రీసెంట్‌గా సీక్రెట్‌గా ఓ కథ విన్నారట. ఇంతకీ మహేష్‌‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరంటే... అనిల్ రావిపూడి అని సమాచారం. 
 
'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్‌ - అనిల్ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. అయితే.. కాస్త టైమ్ తీసుకుని సినిమా చేయాలనుకున్నారు. లాక్డౌన్ టైమ్‌లో టైమ్ దొరకడంతో అనిల్ కథ రెడీ చేసాడట. అనిల్ చెప్పిన కథకు మహేష్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మరి.. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో..? ఎవరు నిర్మిస్తారో క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ - అల్లు అర్జున్ భారీ మల్టీస్టారర్ మూవీ?