Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్ని... హీరో సాయికుమార్ సినీ ఫీల్డ్ లో అడుగుపెట్టి 50 ఏళ్ళు!

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (13:07 IST)
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయికుమార్ ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
 
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 50 ఏళ్ల పూర్తవుతాయని చెప్పారు. ఈ ఏడాది తాను పలు భాషల చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పిన ఆయన ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదంపై స్పందించారు. టికెట్ల ధర నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ వేసిందని, వర్చువల్‌గా సమావేశం కూడా జరిగిందని పేర్కొన్నారు. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సాయికుమార్, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.  టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments