బంగ్లాదేశ్ దేశంలో ఓ ఫెర్రీ బోటులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. మరో వంద మందివరకు గాయపడ్డారు. సదరన్ బంగ్లాదేశ్‌లో దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాద సమయంలో బోటులో 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు 32 మృతదేహాలను వెలికితీశారు. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఫెర్రీ బోటు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ మంటల్లో చిక్కుకుని అనేక మంది మృత్యువాతపడగా, మరికొందరు ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో బంగ్లాదేశ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.