Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రమాత్రలు మింగిన హీరో డాక్టర్ రాజశేఖర్... ఎందుకు?

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి మరో కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి అస

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:52 IST)
టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి మరో కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి అసలు కారణం తాజాగా వెల్లడైంది. 
 
హైదరాబాద్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని రాజశేఖర్ తన కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. 
 
మరి కారు ప్రమాదానికి గురికావడానికి కారణమేంటని పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాజశేఖర్ తల్లి కొద్ది రోజుల క్రితం మరణించగా, అప్పటినుండి ఆయన చాలా మానసికంగా కుంగిపోయాడు. చనిపోయిన తల్లి మళ్ళీరాదని, ఎన్ని రోజులు ఇలా బాధపడుకుంటూ కూర్చుంటావని కుటుంబసభ్యులు రాజశేఖర్‌కి హితవు పలికే ప్రయత్నం చేశారు. 
 
ఈక్రమంలో మాటమాట పెరిగి కోపంతో బంజారా హిల్స్‌లోని తన ఇంటి నుంచి కారులో బయటకి వచ్చాడు. ఆ టైంలోనే కొన్ని నిద్ర మాత్రలు కూడా వేసుకున్నాడని పోలీసుల సమాచారం. ఇక శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 240 వద్ద కారు ఆపి సిగరెట్ తాగాడని, ఆ తర్వాత రామిరెడ్డి కారుని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం చేశాడని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments