Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామెడీ టచ్‌తో ఆసక్తిని రేపుతోన్న 'గరుడ వేగ' టీజర్

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్‌గా మంచి మార్కులు కొట్టేసిన రాజశేఖర్, ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. వరుస పరాజయాలు ఎదురుకావడమే అందుకు కారణం. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఎక్కువగా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న

Advertiesment
కామెడీ టచ్‌తో ఆసక్తిని రేపుతోన్న 'గరుడ వేగ' టీజర్
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (10:43 IST)
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్‌గా మంచి మార్కులు కొట్టేసిన రాజశేఖర్, ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. వరుస పరాజయాలు ఎదురుకావడమే అందుకు కారణం. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఎక్కువగా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న రాజశేఖర్, అదే తరహా పాత్రను 'గరుడ వేగ'లో పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
కాగా, ఈ చిత్రాన్ని దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో ఛేజింగులు.. ఫైరింగులతో.. చివరిలో కాస్తంత కామెడీ టచ్‌తో ఈ టీజర్‌ను ఆసక్తికరంగానే కట్ చేశారు. తన స్టైల్‌కి తగిన సినిమా కావడంతో రాజశేఖర్ భారీ ఆశలే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పూజా కుమార్ .. శ్రద్ధా కపూర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీబీఎం విద్యార్థినిపై అత్యాచారం... "చెన్నై ఎక్స్‌ప్రెస్" చిత్ర నిర్మాతే రేపిస్టు