Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ప‌రిశ్ర‌మ‌కు అన్నీ మంచి రోజులే... సీఎం జ‌గ‌న్ కి కృత‌జ్ఞ‌త‌లు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (10:58 IST)
బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో హీరో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌ చేసారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేసారు. అయన ఉన్న అన్ని రోజులు సినిమాకు అంతా మంచి రోజులే అని చెప్పుకొచ్చారు. 

 
నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లు హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం బంగార్రాజు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రూ. 50 కోట్లను రాబ‌ట్టి, క‌రోనాను సైతం త‌ట్టుకొని నిలిచింది. దీంతో సినిమా స‌క్సెస్‌ను చిత్ర యూనిట్ సెల‌బ్రేట్ చేసుకుంది. బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్ పేరుతో విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

 
రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్ , నటుడు నారాయణమూర్తి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా న‌టుడు నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా నాగ్ మాట్లాడుతూ, ఇటీవ‌ల సిఎం జ‌గ‌న్‌తో స‌మావేశం గురించి చిరంజీవితో మాట్లాడాన‌ని చెప్పుకొచ్చారు. సినీ ప‌రిశ్ర‌మ‌పై సానుకూలంగా స్పందించిన జ‌గ‌న్‌కు నాగ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక‌పై సినీ ప‌రిశ్ర‌మ‌కు అన్నీ మంచి రోజులేన‌ని చెప్పుకొచ్చారు నాగార్జున‌. ఎన్టీఆర్ , ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారని చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వాళ్లిద్దరు జీవించే ఉంటారని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రపంచమంతా సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తెలుగువాళ్లు సినిమా చూస్తామనే నమ్మకాన్ని కలిగించారని, బంగార్రాజు విజయం నా నమ్మకం కాదు, తెలుగు ప్రేక్షకులపై ఉన్న నమ్మకమ‌ని నాగార్జున అన్నారు.
 

ఇక ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఆర్ నారాయ‌ణ మూర్తి మాట్లాడుతూ,  ‘సినిమాని కాపాడాలని సంక్రాంతి కి లాక్ డౌన్ కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షో లకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండగంటే దేవుడి పండుగ, కోడి పందాల పండుగ, సినిమా పండగ, సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు అన్నారు. అన్ని షో లు బ్ర‌హ్మాండంగా ఆడించుకోండని జగన్ మోహన్ రెడ్డి చెప్ప‌డంతో బంగార్రాజు మంచి విజ‌యాన్ని అందుకుందన్నారు. హృదయ పూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నారాయ‌ణ మూర్తి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments