Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ హౌస్‌లోకి హెబ్బాపటేల్.. ఎందుకో తెలుసా?

బుల్లితెరపై బిగ్‌బాస్ హంగామా అంతా ఇంతా కాదు. జూన్ 10 నుండి 100 రోజుల పాటు 16 మంది సెలబ్రిటీలతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా మారింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్

Webdunia
గురువారం, 12 జులై 2018 (19:11 IST)
బుల్లితెరపై బిగ్‌బాస్ హంగామా అంతా ఇంతా కాదు. జూన్ 10 నుండి 100 రోజుల పాటు 16 మంది సెలబ్రిటీలతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా మారింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అంతకు మించి ఎంటర్‌టైన్ చేసేందుకు నాని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్-1 ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. 
 
అయితే, ఎన్టీఆర్ ఆకట్టుకున్నంతగా నాని ఆకట్టుకోలేకపోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. షోలో ఉన్న పార్టిసిపెంట్లు కూడా పెద్ద సెలబ్రిటీలు కాకపోవడం కొంత వెలితిగా ఉందని టాక్ వస్తోంది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో వున్న వెలితిని పోగొట్టేందుకు.. గ్లామర్ పెంచేందుకు బిగ్ బాస్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, షోకు కొంచెం గ్లామర్ అద్దడం ద్వారా మంచి రేటింగ్స్ సాధించాలనే భావనలో బిగ్ బాస్ టీమ్ ఉందని తెలుస్తోంది.
 
ఇందులో భాగంగా యంగ్ హీరోయిన్ హెబ్బాపటేల్‌ని రంగంలోకి దించనున్నారట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి హెబ్బా పటేల్‌ను పంపించాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోందట. ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని సమాచారం. ఈ వీకెండ్‌లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే కనుక జరిగితే.. బిగ్ బాస్ హౌస్‌కు కళ వచ్చినట్లే. హెబ్బాకు వున్న క్రేజ్‌ను బిగ్ బాస్ టీమ్ అలా ఉపయోగించుకోనుందన్నమాట.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments