Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోస్ లో జ్ఞానశక్తి సన్నగిల్లిందా?

డీవీ
బుధవారం, 31 జులై 2024 (09:39 IST)
guturukaram, sradha
తెలుగు సినిమాల్లో గతంనుంచి అసభ్యపదజాలాలు, సన్నివేశాలు ఎక్కువగా వుండేవి. ముఖ్యంగా క్లబ్ డాన్స్ వుంటే జయమాలిని, జ్యోతిలక్మిలు తమ అందాలను ఆరబోస్తూ, కవ్వించే కళ్ళతో ప్రేక్షకులను మైమరిపించేవారు. ఆ ట్రెండ్ వారసత్వంలా అలా కొనసాగుతూ వస్తోంది. అప్పట్లో పెద్దగా చదువుకోనివారు కూడా డైరెక్టర్లు కావడంతోపాటు ప్రేక్షకుల పల్స్ అంటూ ఏదో చెబుతూ సినిమాలు తీసేవారు.

కానీ ఇప్పుడు వచ్చే దర్శకులు, టెక్నీషియన్లు ఎడ్యుకేటెడ్ అయినా పాతచింతకాయ పచ్చడినే కొనసాగిస్తున్నారు. ఇందులో శేఖర్ కమ్ముల ఒక్కరే మినహాయింపు అని చెప్పాలి. తను తీసే సినిమాల్లో ఎటువంటి అసభ్యత లేకుండా మా అమ్మగారు కూడా చూస్తే మెచ్చుకునేలా వుండాలి. పిల్లలపై మనసులను చెడకొట్టకూడదని ఇటీవలే స్టేట్ మెంట్ ఇచ్చారు. అందుకే తాను ఆచితూచి కథలు రాసుకుంటున్నాను. దానికోసం కాస్త టైం పడుతుందని అని క్లారిటీ ఇచ్చారు. 
 
ఇటీవలే త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారం చూశాక త్రివిక్రమ్ శ్రీనివాస్ లో రచనా శక్తి తగ్గింది. వేస్ట్ ఫెలో అని విశ్లేషకుడు బాబు గోగినేని కామెంట్ చేశాడు. గుంటూరు కారంలో.. అసభ్మయ పదజాలాలున్నాయి.  శ్రీలీలతో ఎర్రగా బుర్రగా వుందంటూ  గొడుగు పట్టుకోవడం.. మేం ఎర్రగా వుంటాం .మాడిపోతాం.. గొడుగు తీస్తాం..అంటూ  కొన్ని ఇబ్బందికరపదాలున్నాయి. మరో సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ పడుకోవడం నిద్రపట్టకపోవడం, కాలిమీద వేయడం తల్లి, మేనమామ ప్రోత్సహించడం.. ఓ అగ్ర హీరోల సినిమాలు అవసరమా? ఇవే నేటి పిల్లలు, యూత్ చూసి నేర్చుకుంటారు. ఇలాంటివా నేడు సినిమాల్లో పెట్టేది అంటూ మండిపడ్డారు. 
 
ఒకప్పుడు ప్రేమనగర్ లో  లె.లె..లే.. లేపమంటావా.. నిద్దుర లేపమంటావా.. అంటూ జ్యోతిలక్మి డాన్స్ వేస్తూ యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక ఎన్.టి.ఆర్. జై లవకుశలో నూ చాలా బూతు వుంది.   కోడి రామక్రిష్ణ  సినిమాలో చిన్న పిలుపుసు, పెద్ద పులుసు, నీ రింగ్ లో నా ఫింగర్.. అనేవి కూడా అలాంటివే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అయితే కరెంట్ ఆగిపోతే. తల్లీ కూతుళ్ళను చిరంజీవి ఏదో చేసేటిసట్లేగా చూపించారు. అల్లుడా మజాకా చిత్రంలో. ఇవన్నీ ఒకకాలంనాటివి. కానీ టెక్నాలజీ ఐడియాలు మారుతున్న కాలంలో కూడా ఇలాంటి పోకడలు రావడం శోచనీయం. దీనిపై సెన్సార్ కూడా సరిగ్గా పట్టించుకోవడంలేదని వాపోయారు. 
 
ఇప్పుడు ఫేమస్ అయిన హీరోయిన్లను పలుకరిస్తే, ఒకప్పుడు మేం ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కోసం కొన్ని వాంప్ తరహా పాత్రలు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తుంటే మేమేనా అలా చేసింది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా హీరోయిన్లు వాంప్ లకు మించి ఎక్స్ పోజింగ్ చూపిస్తున్నారు. అందరూ పరభాషా నటీమణులే. వారికి తెలుగు పదాలు అర్థంకావు. వారు పాటలో పాడే లిరిక్ లోనూ అసభ్యపదాలుంటాయి. దీనిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని సీనియర్ నటి జయసుధ వ్యాఖ్యానించారు. ఇక రోజా సంగతి తెలిసిందే. పక్కా మాస్ పాత్రలు పోషించి యూత్ ను రెచ్చగొట్టేది.  ఏది ఏమైనా ఇప్పటికైనా చాలామంది మంచి సినిమాలు వస్తున్నాయి. దర్శకులు వున్నారు. పాత చింతకాయ తరహా చిత్రాలు తీయకపోవడమే బెటర్ అని తెలియజేస్తున్నారు. సెన్సార్ లో కూడా పలు మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రముఖులు తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments