Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ ఆఫర్ ఇస్తే నో చెప్పిన హరీష్ శంకర్, ఎందుకో తెలుసా..?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (22:36 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే... ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో నటించనున్నారు. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీ రీమేక్ రైట్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ దక్కించుకున్నారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవితో లూసీఫర్ రీమేక్‌ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్‌.
 
అయితే.. లూసీఫర్ రీమేక్‌ని డైరెక్ట్ చేయమని హరీష్ శంకర్‌కి ఛాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారు. గతంలో పవన్‌తో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కించడం.. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం తెలిసిందే. పవన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో వకీల్ సాబ్, క్రిష్‌తో చేయనున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
 
అయితే... పవన్‌తో సినిమా చేస్తుండడంతో హరీష్ శంకర్ చిరంజీవిని స్వయంగా కలిసి పవన్‌తో సినిమా చేస్తున్నందు వలన ఇప్పుడు లూసీఫర్ రీమేక్‌ని డైరెక్ట్ చేయలేనని.. పవన్‌తో చేయనున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత మీతో సినిమా చేస్తానని చిరంజీవికి హరీష్ శంకర్ చెప్పారని తెలిసింది. పరిస్థితిని అర్ధం చేసుకున్న మెగాస్టార్ ఓకే చెప్పడంతో పవన్ మూవీ వర్క్ చేస్తున్నారు హరీష్ శంకర్. 
 
ఇప్పుడు లూసీఫర్ రీమేక్‌కి డైరెక్టర్ ఎవరు అంటే... డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పేరు వినిపిస్తోంది. సుకుమార్, వంశీ పైడిపల్లి పేర్లు వినిపించినప్పటికీ.. వినాయక్‌కే ఛాన్స్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మలయాళంలో విజయం సాధించిన ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసారని.. ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చరణ్‌ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆచార్య మూవీ షూటింగ్ అయిన వెంటనే ఈ సినిమాని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. లూసీఫర్ డైరెక్టర్ ఎవరనేది త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments