Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

డీవీ
మంగళవారం, 24 డిశెంబరు 2024 (17:48 IST)
Pawan kalyan- allu arjun family
పుష్ప 2 సినిమా విడుదలకుముందు సంథ్య థియేటర్ లో జరిగిన పరిణామాలు తెలిసినవే. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం ఆ తర్వాత సినీ పెద్దలు పరామర్శించడం మామూలుగానే జరిగిపోయాయి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కుటుంబాలు అల్లు అర్జున్ కుటుంబాన్ని పలుకరించి ధైర్యం నూరిపోశారు. అదే టైంలో విజయవాడ నుంచి పవన్ కళ్యాన్ హైదరాబాద్ వచ్చారు. మేనల్లుడిని కలుస్తారని పలు ప్రసారసాధనాలు, సోషల్ మీడియా పలు కథనాలు వేశాయి. కానీ ఆయన ఎక్కడా కలిసినట్లు స్పష్టత లేదు.  ఫొటోలుకూడా లేవు.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నాగబాబు, చిరంజీవి కుటుంబాలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అండగా నిలబడ్డాయని తెలుస్తోంది. మారిన టెక్నాలజీరీత్యా హైదరాబాద్ లో వున్న పవన్ కళ్యాణ్ ఆన్ లైన్ లో వాకబుచేసి వుంటాడని సన్నిహితులు చెబుతున్నారు. అంతేకానీ హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్ళడం వెనుక కూడా పలు కారణాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఆయన చట్టానికి ఎవరూ అతీతులుకారని, అదే తన అజెండా అని పలురకరాలుగా పలువురిని విమర్శించిన సందర్భాలున్నాయి. తప్పు ఎవరుచేసినా వదిలేది లేదనేది కూడా జనసేన పార్టీ ఉద్దేశ్యం. అందులోనూ ఓ మహిళ చావుకు కారకులైన 11వ ముద్దాయి అయిన ఆయన్ను పలుకరించడం ఆయన పదవికే ఎసరు కాగలదని పలువురు తెలియజేస్తున్నారు.  అందులోనూ చంద్రబాబు మంత్రివర్గంలో వుండడంతో రాజకీయ అంశాలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
 
సంథ్య థియేటర్ లో ఏమి జరిగింది? అనేది పోలీసులు వర్షన్, థియేటర్ యాజమాన్యం వర్షన్ విరుద్ధంగా వున్నాయి. అల్లు అర్జున్ వాదన కూడా వేరుగా వుంది. కనుక ఏది నిజం? అనేది తెలియజేయడానికి కేస్ కోర్టులో వుంది. ఇలాంటి సమయంలో దాని గురించి చర్చించరు. పైగా పవన్ కళ్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదు. లేనిపోని అభాండాలు ఆయన ఆపాదించుకున్నవారవుతారు. సహజంగా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు, మనస్పర్థలు మామూలే. కానీ కష్టకాలంలో అండగా వచ్చి అందరూ నిలబడి ధైర్యం నూరిపోయడం కూడా అంతే సహజం. కానీ ఇందుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా మినహాయింపు కిందకు వస్తాడు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఏదోవిధంగా పరిష్కారానికి చేయగలడు. కానీ చట్టం తనపని తాను చేయాలి కాబట్టి అటువంటి అడుగులు పవన్ వేయడని సన్నిహితులు తెలియజేస్తున్నారు.
 
ఇక ఈరోజు జరిగిన పరిణామాల వల్ల అమెరికాలో గేమ్ ఛేంజర్ వేడుకనుంచి వచ్చిన నిర్మాత దిల్ రాజు ఓ విషయాన్ని ప్రస్తావించారు. రేవతి కుటుంబాన్ని అండగా వుంటామనీ, ఆమె భర్త భాస్కర్ కు ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇష్యూ కు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు అందుకు పెద్దల సహకారంతో ముందడుగు వేయనున్నట్లు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ హోదాలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి దిల్ రాజు చెప్పేదానిలో వాస్తవం వుంటుందని అందరూ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments