Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆందోళనలో వున్నానంటున్న అల్లు అర్జున్

Allu Arjun

డీవీ

, సోమవారం, 16 డిశెంబరు 2024 (08:23 IST)
Allu Arjun
అల్లు అర్జున్ తాను చాలా ఆందోళనలో వున్నానంటూ కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సంథ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన జరిగాక తాను కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది. అందుకే త్వరగా స్పందించలేదని అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అక్కడ ఓ మహిళ మ్రుతిచెందగా, ఆయన కొడుకు శ్రేతేజ్ కోమాలోకి వెళ్ళాడు. ఇంకా ఇప్పటికీ కోలుకోలేకపోయాడు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత శ్రీతేజ్ తండ్రి భార్గవ్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఉదంతంపై కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.
 
ఇక అల్లు అర్జున్ పిల్లవాడి కుటుంబానికి అండగా వుంటానని హామీ ఇచ్చాడు. వారిని పలుకరించడానికి వెళతామంటే కొన్ని నియమాలున్నాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 'దురదృష్టకర సంఘటన తరువాత వైద్యశాలలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ గురించి నేను చాలా ఆందోళనలో వున్నాను. ప్రస్తుతం నాపై వున్న న్యాయపరమైన విచారణ కారణంగా ఈ సమయంలో శ్రీతేజ్‌తో పాటు అతని కుటుంబాన్ని కలవకూడదని నాపై న్యాయపరమైన షరతులు వున్నాయి. నా సపోర్ట్‌తో వారి కుటుంబ అవసరాలకు, వైద్య అవసరాలకు కావాలిసిన అన్ని సహకారాలు అందించే బాధ్యతకు నేను కట్టుబడి ఉన్నాను''   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌ తో అనుష్క శెట్టి ఘాటి సిద్ధమవుతోంది