Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

Advertiesment
Allu Arjun, Chiranjeevi

డీవీ

, సోమవారం, 16 డిశెంబరు 2024 (13:46 IST)
Allu Arjun, Chiranjeevi
అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ముందుగా ఊహించిందే అని దీనికోసం రెండు నెలలక్రితమే కసరత్తు జరిగిందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. పుష్ప 2 ప్రమోషన్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తురాక పక్కన వారిని అడగడం, తటపడుతూ వున్నట్లు నీరు తాగడం వంటిివి జనాలు మర్చిపోయినా రాజకీయనాయకులు మర్చిపోరని విషయం ఆయన గుర్తించలేదనే చెప్పాలి. ఆ విషయంలో అల్లు అర్జున్ యాట్యిట్యూడ్‌ను మార్చుకోవాల్సిందేనని ఆయనకు ఎవరూ చెప్పకపోవడం విచారకరం. ఇక  మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో అల్లు అర్జున్ మధ్య దూరం రావడానికి యాట్యిట్యూడ్ కూడా ప్రధాన కారణంగా చెబుతున్నాయి.

పుష్ప 2 రిలీజ్‌కు ముందు కొంతకాలం పాటు నెగెటివ్ టాక్‌తో అన్ని చోట్ల స్తబ్దతగా వున్న దాన్ని ఒక్కసారిగా ప్రచారపరంగా హైలైట్ చేస్తూ వచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ ప్రవర్తన అనేది చాలా దుందుడుకుగా మారిందనే చెప్పాలి. అందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఆయన నటన, స్టైల్, మాటతీరుకూడా మారిపోయింది. పుష్ప సినిమా హిట్ అయ్యాక అస్సలు ఈ సినిమా ఇంతలా హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించారు.

సుకుమార్ కూడా ఓ కారణమేనా?
 
పుష్ప సినిమాతోనే దర్శకుడు సుకుమార్ ఆయనకు ఐకాన్ స్టార్ అనే బిరుదు ఓ ఫంక్షన్లో ప్రదానం చేశారు. అంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారడానికి సుకుమార్ సపోర్ట్ నూరు శాతం వుందనేది వాదన కూడా వినిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన పలు ఫంక్షన్లలో ఎక్కడా చిరంజీవి వల్ల ఈ స్థాయికి వచ్చానని మాత్రం చెప్పలేదు. తనకు తానే ఎదిగానని చెప్పడం విశేషం. దీనికి కారణం అంతర్గతంగా ఇరు కుటుంబాల్లో నెలకొన్న పరిస్థితులే అని తేటతెల్లమయింది. చాలా స్పీడ్‌గా వెళుతూ తగ్గేదేలే అన్న వ్యక్తి ఈసారి రెండు చేతులతో అస్సలు తగ్గేదేలే అన్నట్లు రెట్టింపుగా వుండడాన్ని చాలామంది అల్లు అర్జున్‌కు ఎక్కడో చోట బ్రేక్ పడాలని కోరుకున్నారు. స్వయంగా ఆయన ఫ్యాన్స్ కూడా అందులో వున్నారు.
 
అయితే ఆమధ్య ఆయ్ అనే సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లు కాంపౌండ్ మనిషి అయిన నిర్మాత బన్నీవాస్ కూడా కొద్దిమంది విలేకరులతో మాట్లాడినప్పుడు, అల్లు అర్జున్, చిరంజీవి కలవరా? మీలాంటి వారు చొరవ చూపవచ్చుగదా? అని అడిగితే.. వారు కలవాలంటే బలమైన సిట్యువేషన్ జరగాలి అంటూ ఠక్కున సమాధానమిచ్చాడు. అప్పుడు ఆయన అయ్యప్ప మాలలో వున్నాడు. ఆ తర్వాత వారు మర్చిపోయారనే చెప్పాలి. బలమైన సంఘటన అంటే ఏమి జరుగుతుంది? మరలా ఇద్దరినీ కూర్చొపెట్టి మాట్లాడే వ్యక్తి బలమైనవారు రావాలా? అంటూ అనుకున్నారు మినహా ఇలా అనుకోని వివత్తు అనండి, ఏదో తెలీని శక్తి వారిని కలిసేలా చేసిందేమో అని నిన్న చిరంజీవిని అల్లు అర్జున్ కలిసాక గుర్తుకుచేసుకోవడం విశేషం. పనిలో పనిగా నాగబాబు ఫ్యామిలీని కూడా ఆయన కలిసారు. 
 
అసలు ఈ వ్యత్యాసానికి వ్యక్తిగతంగా పలు కారణాలున్నా, రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ అవార్డు రావడం నుంచి అల్లు అర్జున్‌లో ఇగో హర్ట్ అయిందని సన్నిహితులు చెబుతున్నారు. ఆ తర్వాతే పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఆయన కాస్త కూల్ అయి తన సత్తా ఏమిటో చూపించానని అన్నట్లు తెలిసింది. ఇంకోవైపు పుష్ప 2లో చిరంజీవిని ఉద్దేశించి.. ఎవడ్రా బాస్.. నాకు నేనే బాస్. వాడి కొడుక్కూ నేనే బాస్ అంటూ డైలాగ్‌లు కూడా పెట్టడంతో చిరంజీవి సన్నిహితులు కానీ, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ బిహేవియర్‌కు బ్రేక్ వేయాలని చూశారు. 
 
జైలు నుంచి వచ్చాక  నిన్న చిరంజీవి, సురేఖ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఫ్యామిలీని పలుకరించడం జరిగింది. నాగ బాబు కూడా వెళ్ళారు. కానీ ఆ టైంలో అరవింద్ ఇంటిలో లేడు. ఇక అల్లు అర్జున్ ఇంటికి వచ్చాక కేవలం అత్తగా సురేఖ మాత్రమే వచ్చి ధైర్యం చెప్పారు. ఆ మరుసటి రోజు అల్లు అర్జున్ ఫ్యామిలీతో చిరంజీవి ఇంటిికి వెళ్ళారు. అంటే అత్త ప్రమేయంతోనే వచ్చాడనేది కూడా కనిపిస్తుంది. చిరంజీవి ఇంటిలో అక్కడ గంటసేపు మాత్రమే వున్నారు. లోపలికి వెళ్ళి చిరంజీవిని కలిసే విధానంలో ఫొటోలు కానీ, వీడియో కానీ లేవు. కేవలం ఒక్క ఫొటోను బయటకు రిలీజ్ చేశారు. అంటే చిరంజీవి ఇంకా కన్వీన్స్ అవ్వలేదని తెలుస్తోంది. అంటే ఇంకా అర్జున్ మారలేదనేది తేటతెల్లమవుతుంది.
 
అందుకు ఆజ్యం పోస్తూ,  ఈ అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళిననాడే ఆంధ్రప్రదేశ్ అవతర దినోత్సవానికి కారకుడైన పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో కూడా లోతైన అర్థం దాగి వుంది. మనిషి మర్చిపోవడం సహజమని, కానీ, ఎవరైతే అన్నం పెట్టారో, నిలబడ్డారో, పని చేసారో వారిని కూడా మర్చిపోతాం మనం. కానీ వారిని గుర్తుంచుకోవడం చాలా అవసరం. మనం ఎవరి నుండి వచ్చామో గుర్తు ఉంచుకోవడం చాలా అవసరం అని పొట్టి శ్రీరాములు త్యాగం గురించి మాట్లాడారు. కానీ ఆయన మాటల్లో చాలా అర్థం దాగి వుంది. దాన్ని బట్టి చూస్తే చిరంజీవి ఇంటికి వెళ్ళినా అల్లు అర్జున్ ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఎపిసోడ్లో మనస్పర్థలకు ముగింపు ఏవిధంగా పడుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)