Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చూసి అందమైన అబ్బాయిలు భయపడుతున్నారు, ఎందుకో?

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (23:29 IST)
నేను అందరిలాంటి అమ్మాయినే. నన్ను చూస్తుంటే ఎందుకో చాలామంది భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు. నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయండి.. నేను ఓపెన్‌గా మాట్లాడుతూ... మీకు క్షణంలో సమాధానం కూడా చెబుతాను. ప్రపోజ్ చేయడానికి భయపడితే ఎలా అంటోంది హాట్ యాంకర్ విష్ణుప్రియ.
 
ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో బోల్డ్‌గా ఆమె మాట్లాడింది. నేను అందంగా లేనా. నన్ను చూడండి.. ఎంత ఫిట్‌గా, బబ్లీగా ఉన్నానో. చూస్తేనే తెలుస్తుంది కదా. అయితే ఎందుకు నాకు ప్రపోజ్ చేయడం లేదు. అందరూ విష్ణుప్రియ యాంకరింగ్ బాగుంటుంది. అమ్మాయి అందంగా ఉంటుందని చెబుతున్నారు.
 
అది ఒకే. అయితే అదొక్కటే కాదు కదా. నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. అది కూడా నాకు నేనుగా సెలక్ట్ చేసుకోబోయే అబ్బాయి. నేను ఎన్నో ఎపిసోడ్లు చేశాను. ఎంతోమందితో మాట్లాడాను. అయితే వారెవరూ నా ముందుకు వచ్చి నువ్వు అందంగా ఉన్నావు. పెళ్ళి చేసుకుందామా అంటూ అడగలేదు.
 
నేను ఎంతోమంది అందమైన అబ్బాయిలు కూడా చూశాను. వారెందకు భయపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను కొట్టను. నేను ఏమీ అనను. నేను పెళ్ళి చేసుకోవాలి. అది కూడా మనస్సుకు బాగా నచ్చిన వ్యక్తితోనే ఏడడుగులు నడవాలనుకుంటున్నాను. 
 
అంతేకాదు అందమైన నా భర్తను చూస్తూ కాపురం చేయాలనుకుంటున్నానని బోల్డ్‌గా విష్ణుప్రియ చెప్పేసింది. ఇక పెళ్ళయిన తరువాత యాంకరింగ్ చేస్తారా అన్న విషయంపై ఆమె అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పుకొచ్చింది. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments