Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ హౌస్‌లో హట్ యాంకర్ విష్ణుప్రియ

Advertiesment
బిగ్ బాస్ హౌస్‌లో హట్ యాంకర్ విష్ణుప్రియ
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:23 IST)
తెలుగులో నాలుగు సీజన్లలో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఐదవ సీజన్ ప్రసారమవుతుంది. అయితే గతంలో మాదిరి కాకుండా ఈ సీజన్ లో ఏకంగా 19మంది కంటెస్టెంట్‌లతో ప్రారంభమైన ఈ షో మొదటి వారంలోనే ఎంతో రసవత్తరంగా మారింది.
 
హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఏ కంటెస్టెంట్‌లు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎవరికివారు పోటీపడుతూ వారికి వారు స్ట్రాంగ్ అని నిరూపించుకుంటున్నారు. అయితే ఎప్పుడూ కూడా బిగ్ బాస్ కార్యక్రమం నాల్గవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ సీజన్‌లో మాత్రం రెండు వారాలకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 
బుల్లితెర యాంకర్‌గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ విష్ణుప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈమెకు బుల్లితెర పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
 
యాంకర్‌గా బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన వర్షిని అంటే యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. యాంకరింగ్ మాత్రమే కాకుండా యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ మరింత రెట్టింపు అవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ వ‌చ్చేస్తోంది