Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్ర‌పురి కాల‌నీ వాసుల‌ను దోచేస్తున్న జ‌ల‌గ‌లు - బినామీల‌తో నామినేష‌న్లు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (15:53 IST)
Chitra puri colony
సినిమారంగంలోని 24 శాఖ‌ల‌కు చెందిన కార్మికుల‌కు ఉమ్మ‌డి రాష్ట్రంలో వుండ‌గా కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు నాన‌క్‌రామ‌గూడ‌కు స‌మీపంలోని కొండ‌పై 60 ఎక‌రాల స్థలాన్ని ఇచ్చారు. ఆ త‌ర్వాత వై.ఎస్‌. హ‌యాంలో కార్య‌రూపం దాల్చింది. దాస‌రి నారాయ‌ణ‌రావు వంటి పెద్ద‌లు దాన్ని కొలిక్కి తీసుకువ‌చ్చారు. కొండ‌ల‌ను చ‌దునుచేసి సింగిల్ బెడ్ రూమ్‌, డ‌బుల్, త్రిబుల్‌, రో హౌస్‌లు నిర్మాణం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.
 
అయితే అప్ప‌ట్లో హౌసింగ్ సొసైటీ పేరుతో కొమ‌రం, అనిల్ వ‌ల్ల‌భ‌నేని, వినోద్ బాల‌, కాదంబ‌రి కిర‌ణ్ తో స‌హా 11 మంది క‌మిటీ వుండి. ఎన్నిక‌లు లేకుండానే ఎన్నికైన‌ట్లు అధికారుల‌ను లంచం ఇచ్చి కాలం గ‌డిపిన‌ట్లు తెలిసింది. ఆ త‌ర్వాత ఇటీవ‌లే  6నెల‌ల‌నాడు కొత్త‌గా జ‌రిగిన ఎన్నిక‌లు ఎంత రాద్దాంతం జ‌రిగిందో తెలిసిందే. కొమ‌రం, అనిల్‌, సి.క‌ళ్యాణ్‌, త‌మ్మారెడ్డి, ఓ. క‌ళ్యాణ్ వంటి పేన‌ల్స్ పోటీచేశాయి. ఫైన‌ల్‌గా అనిల్ పేన‌ల్ గెల‌వడం కూడా వివాదాస్ప‌ద‌మైంది. 
 
గ‌తంలో చేసిన క‌మిటీ స‌భ్యులు ఇప్ప‌టి నూత‌న క‌మీటీలోని ముప్పావువంతు స‌భ్యులు కోట్ల రూపాయ‌లు తిన్నార‌నేది అభియోగం. దానిపై ఏళ్ళ త‌ర‌బ‌డి పోరాట సంఘాలు చేస్తున్న పోరాటంతో ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి 51 ఎంక్వ‌యిరీ కూడా ఏర్ప‌డింది. ఇప్పుడు 51 ఎంక్వ‌యిరీ లో అస‌లు కార్మికులు వుంటున్న ఇంటి య‌జ‌మానుల‌ను, సిబ్బందిని విచారించ‌కుండా అధికారులు కొంద‌రు మంత్రుల అండ‌తో తాత్సారం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు సినిమారంగంలోని ప్ర‌బ‌లంగా వినిపిస్తున్నాయి. 
 
వెల్ఫేర్ పేరుతో ప‌న్నుల రూప‌ణం డ‌బ్బు వ‌సూలు
ఇక తాజాగా సింగిల్‌, డ‌బుల్‌, త్రిబుల్‌.. నివాసితుల క్షేమం కోసం వెల్ఫేర్ అసోసియేషన్ ను సొసైటీ స‌భ్యులే ఏర్పాటుచేసి వారికి అనుగుణంగా స్వ‌ప్ర‌యోజ‌నాలు చేసుకుంటార‌నే టాక్ నెల‌కొంది. ఇటీవ‌లే ఎల్‌.ఐ.జి. (సింగిల్ బెడ్‌రూమ్‌) ఓన‌ర్స్ అసోసియేష‌న్ పేరుమీద అస‌లు ఓన‌ర్ల‌ను కాకుండా బినామీ పేర్ల‌ను రాసుకుని ఓటింగ్‌కు సిద్ధం చేసిన‌ట్లు చిత్ర‌పురి పోరాట సంఘం అధ్య‌క్షుడు క‌స్తూరి శ్రీ‌ను అధికారుల‌కు ఫిర్యాదు చేశారు.

ఇలా బినామీల‌ను కాల‌నీ వెల్ఫేర్ ఎన్నిక‌ల్లో గెలిపించి, అనంత‌రం మెయింటెన్స్‌, కారు పార్కింగ్‌, ఇల్లు అద్దె కు ఇస్తే 3వేలు క‌మీష‌న్ ఇలా వసూలు చేయ‌నున్న‌ట్లు క‌స్తూరి శ్రీ‌ను తెలిపారు. గ‌తంలో ఈ విష‌యాల‌ను కెటి.ఆర్‌. దృష్టికి తీసుకువ‌చ్చామ‌నీ, ఆప‌నిని త‌ల‌సానికి అప్ప‌గించార‌నీ ఆయ‌న సొసైటీ పెద్ద‌ల‌తో కుమ్మ‌క్క‌యార‌ని శ్రీ‌ను వాపోతున్నారు. ఇక మాకు న్యాయం ఏం జ‌రుగుతుంద‌ని బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఆయ‌న ఇచ్చిన ఫిర్యాదు వివ‌రాలు ఇలా వున్నాయి. 
Lig /ews వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు డిసెంబర్ 12న అని నోటిఫికేషన్ ఇచ్చారు... ఒరిజినల్ సొసైటీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళని కూడా డబ్బులు కట్టి ఓటర్ లు గా నమోదు చేసుకోవాలి అని పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్, మరియు పది సంవత్సరాల వరకు ఫ్లాట్ అమ్మడం కొనడం నేరం అని బోర్డు కూడా పెట్టారు, మరి అలాంటి వారికి ఓటు హక్కు ఇవ్వడం వెనక అర్ధం ఏంటి, lig /ews ఆర్థికంగా మైనస్ లో ఉంది,షాపింగ్ కాంప్లెక్స్ నిరూపయోగంగా ఉంది, ప్లాట్స్ లేకేజీ లు, కుక్కల గొడవ, సెల్లార్ లో డ్రైనేజీ ప్రాబ్లెమ్, సీసీ కెమెరాలు లేకపోవడం వలన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇలా చాలా సమస్యలు తీరకుండానే సొసైటీ ఇలా ఎలక్షన్స్ పెట్టి చేతులు దులుపుకోవడం వెనక సొసైటీ చేసిన తప్పులను ఇక్కడ సభ్యులపై రుద్దడమే అని అనిపిస్తుంది..51ఎంక్వయిరీ రిపోర్ట్ అవకుండానే, కోర్ట్ నుండి వచ్చిన 120 డేస్ పూర్తి కాకుండానే తొందరగా జరపడం వెనక అవినీతి ని తప్పించుకునే ఆలోచన అని అర్ధం అవుతుంది, మరియు ఒక వైపు పది సంవత్సరాలు ప్లాట్స్ అమ్మద్దు అని బోర్డు పెట్టి మీరే NOC సొసైటీ నుండి తీసుకోవాలి అని బోర్డు పెట్టారు, అంటే అడ్డదారిలో డబ్బులు తీసుకొని NOC ఇవ్వడం కోసం అని అర్ధం అవుతుంది...
ఇలాంటి మోసపూరిత ఆలోచనలు మానేసి ఎలక్షన్స్ రద్దు చేయాలనీ కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
దీనిపై సొసైటీల‌కు సంబంధించిన ఎన్నిక‌ల అధికారి జ‌నార్ధ‌న్ ఏమేర‌కు స్పందిస్తారో చూడాల్సిందేన‌ని క‌స్తూరి శ్రీ‌ను తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

కారులో ప్రియురాలుతో సర్పంచ్, డోర్ తీసి పిచ్చకొట్టుడు కొట్టిన భార్య (video)

డొనాల్డ్ ట్రంప్‌తో భారతీయ ఐటీకి కష్టకాలం.. వీసా ఆంక్షలు సైతం పీడకల?!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments