ప్రైవేట్ స్కూళ్లకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనికోసం మధ్యతరగతి జనాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్స్‌లో చేర్పించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇక ఓ జిల్లాకు కలెక్టర్ అయిన అధికారి తన పిల్లలను ఇంకెంత పెద్ద స్కూల్‌లో చదివించగలరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కుమురంభీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాత్రం విభిన్నంగా ఆలోచించి అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. కలెక్టర్ రాహుల్‌రాజ్ తన ఇద్దరు కుమార్తెలను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ఆ చిన్నారులు మూడు నెలలుగా జన్కాపూర్-1 అంగన్‌వాడీ కేంద్రానికి వస్తూ ఓనమాలు దిద్దడంతో పాటు తోటి పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్నారు.
దీనిపై అంగన్‌వాడీ టీచర్ అరుణ స్పందిస్తూ.. కలెక్టర్ పిల్లలు కూడా అందరితో పాటే తాము వండిన భోజనమే తింటున్నారని చెప్పారు. ఎంతో ఉన్నతంగా ఆలోచించిన కలెక్టర్ రాహుల్‌రాజ్‌పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.