Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శబరిమల యాత్ర తాత్కాలికంగా నిలిపివేత... వ‌ర్షాలే కార‌ణం!

Advertiesment
శబరిమల యాత్ర తాత్కాలికంగా నిలిపివేత... వ‌ర్షాలే కార‌ణం!
విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (17:04 IST)
అయ్య‌ప్ప మాల ధ‌రాణ చేసి శ‌బ‌రిమ‌లైకి వెళ్ళే భ‌క్తుల‌కు ప‌కృతి ఆటంకంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతల మవుతున్నాయి. కుండపోత వర్షాలు, వరదలతో ఆయా రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తు్న్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
 
ద‌క్షిణాదిన భారీ వర్షాలతో పంబా నది సహా ప్రధాన నదుల్లో నీటి మట్టం పెర‌గడంతో శనివారం ఒక్కరోజు శబరిమల స్వామి దర్శనాలను నిలపివేస్తున్నట్లు పథనంతిట్టా జిల్లా కలెక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకున్న భక్తులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. యాత్రికులు అధికారులతో సహకరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
 
 
అలాగే, పంబా ప్రాజెక్టు వద్ద రెడ్‌ అలెర్ట్ ప్ర‌క‌టించారు. కుండపోత వర్షాలు, వరదలతో పంబా నదిలో నీటి ప్రవాహం పెరిగిందని… అందుకే కక్కి అనథోడే అనాతోడ్ రిజర్వాయర్‌ వద్ద రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు జిల్లా అధికారులు చెప్పారు. ప్రాజెక్టు దిగువన నివసించే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశామన్నారు. భక్తులెవరూ పంబానదిలోకి వెళ్లవద్దని సూచించారు.


వరద ప్రవాహం ఇలాగే పెరిగితే డ్యామ్‌ గేట్లు తెరుస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. కాగా మండల మకరవిళక్కు పూజల కోసం ఈ నెల 15న శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఆ మరుసటి రోజు నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రోజుకు 30 వేల మంది భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా దర్శనం టోకెన్లు జారీచేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో వరదలు.. ప్రమాదంలో ముగ్గురు మృతి..