Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు: 20 రోజుల్లో రూ. 2.8 కోట్లు

Advertiesment
Shree Durga Malleshwara Swamy Warla Temple
, మంగళవారం, 16 నవంబరు 2021 (22:53 IST)
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ ఈ రోజు 16-11-2021న మహామండపము 6వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు శ్రీమతి చక్కా వెంకట నాగ వరలక్ష్మి గారు, శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి గారు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 
 
ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 2,83,62,499/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం:  822 గ్రాములు, 
హుండీల ద్వారా వచ్చిన వెండి:  7 కేజీల 125 గ్రాములు 
లెక్కించిన హుండీలు : 36
గడచిన రోజులు: 20
 
భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. గడచిన  రోజులలో సగటున రోజుకు రూ.14.18 లక్షల చొప్పున దేవస్థానంకు హుండీల ద్వారా ఆదాయం చేకూరింది. రాష్ట్ర దేవాదాయశాఖ వారి website  aptemples.ap.gov. in ద్వారా గడచిన 20 రోజులలో online నందు e- హుండీ ద్వారా రూ.1,26,650/- లు భక్తులు శ్రీ అమ్మవారి దేవస్థానం నకు చెల్లించియున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్‌ యూజీ 2021లో 720 స్కోర్‌ సాధించిన ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌ విద్యార్థి మృణాళ్‌ కుట్టేరి