Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్‌ యూజీ 2021లో 720 స్కోర్‌ సాధించిన ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌ విద్యార్థి మృణాళ్‌ కుట్టేరి

Advertiesment
Aakash Institute
, మంగళవారం, 16 నవంబరు 2021 (22:37 IST)
రోజువారీ పనుల్లో తగిన బ్యాలెన్స్‌, చదువులపై ఏకాగ్రత, మధ్య మధ్యలో స్వల్ప బ్రేక్స్‌ తీసుకొని ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మృణాళ్‌,నీట్‌ యూజీ 2021 పరీక్షలో 720 మార్కులు స్కోర్ చేసి ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 1 సాధించాడు. ఒకప్పుడు కెమికల్‌ ఇంజినీర్‌ కావాలని ఆకాంక్షించిన మృణాల్‌, తొమ్మిది తరగతిలో ఉన్నప్పుడు గ్రహించాడు సమాజానికి సేవ చేసేందుకు మెడిసిన్ మంచి అవకాశమని, ఆరోగ్యరంగంలో కెరీర్‌ ఆసక్తికరంగానే కాదు సవాళ్లతోనూ కూడి ఉంటుందని తెలుసుకున్నాడు.

విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో మాట్లాడుతూ సామాజిక ప్రణాళికతో ఉత్సాహ కరమైన వాతావరణంలో విజయాన్ని అవలీలగా సాధించవచ్చునని  పేర్కొన్నాడు. రీజనల్ హెడ్ ఫర్ అకడమిక్స్ ఆఫ్ సౌత్ జోన్ శ్రీ చందన్ చాంద్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఆర్‌వీఎస్ మూర్తి; రీజనల్ హెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణా శ్రీ ఎం భరత్ కుమార్; ఏరియా బిజినెస్ హెడ్ శ్రీ ఈ రవికిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సీహెచ్ విజయ్‌కుమార్, బ్రాంచ్‌హెడ్ శ్రీ సూర్య భాస్కర్ మరియు ఇతరులు పాల్గొని మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థిని సత్కరించారు. డాక్టర్ పీ శ్యామ్ ప్రసాద్, వైస్ ఛాన్స్‌లర్, ఎన్‌టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

“ఆకాశ్‌లోని నా మెంటార్స్‌ మొదటి రోజు నుంచి నన్ను నేషనల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలు చదవమని చెప్పేవారు. మొదట్లో ఎన్‌సీఈఆర్‌టీ మెటీరియల్‌, ఆకాశ్‌ వారందించిన ఇతర మెటీరియల్‌ చాలా లోతుగా, చాలా ఎక్కువగా అనిపించాయి. కాని, త్వరలోనే లోతుగా చదవడాన్ని నేను అలవాటు చేసుకున్నాను. 45 నిమిషాల పాటు చదివి ఆ తర్వాత 10 - 15 నిమిషాలు బ్రేక్‌ తీసుకునేవాడిని.

ఇది బాగా పనిచేసింది నేను టెస్టుల్లో మంచి స్కోర్‌ సాధించగలిగాను” అంటాడు మృణాళ్‌. బ్రేక్స్‌ సమయంలో అతను వీడియో గేమ్స్ ఆడేవాడు లేదా టీవీ చూసేవాడు. అతని తండ్రి హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌, తల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎప్పుడు చదువుల విషయంలో మృణాళ్‌ను ఒత్తిడి చేయలేదు.  షార్ట్ బ్రేక్‌ తీసుకొని తిరిగి చదువుల్లోకి వెళ్తేంత విల్‌ పవర్‌ అతనికి ఉంది.

“నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు నా హాబీలు వేటిని నేను విడిచిపెట్టలేదు. అలా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో” అని అభిప్రాయపడతాడు మృణాళ్‌. లాక్‌డౌన్ సమయం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది అని అంటాడు. అటు వెళ్లడానికి సమయం వృధా కాకపోయినా ఇంట్లో ఉండి చదవడమన్నది కొంత చికాకుగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చదువుపైనే దృష్టి నిలిపేలా తగిన వాతావరణం ఉండేలా చూసుకున్నాడు. ఉదాహరణకు చదువుకునే సమయంలో మొబైల్‌ ఫోన్‌ దగ్గర ఉంచుకునే వాడు కాదు. నీట్‌ ఎగ్జామ్‌కు నెల ముందు నుంచి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం నేను తగ్గించాను.
అంతే కాని నీట్‌ పేరు చెప్పి నేను బయటి ప్రపంచం నుంచి దూరం వెళ్లిపోలేదు” అంటాడు.

మృణాళ్‌ సాధించిన విజయంపై ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆకాశ్ చౌదరి వ్యాఖ్యానిస్తూ, “ తెలివైన విద్యార్థుల్లో ఒకడైన మృణాళ్‌ కోసం మొత్తం ఆకాశ్‌ టీమ్ అంతా పాటుపడింది. అతనిలో ఆత్మవిశ్వాసం, స్థిరత్వం మాకు కనిపించింది. చదువుకు అవసరమైన సరైన ఆలోచనతో పాటు వ్యూహాం కూడా అతనికి ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే తన టీచర్లు, మెంటార్లతో నివృత్తి చేసుకునే అవకాశాన్ని అతను ఏనాడు వదులుకోలేదు. అసైన్‌మెంట్లు పూర్తి చేయడంలో అతను ఎప్పుడూ ముందుండే వాడు. అనవసరమైన ప్రెషర్‌, ఒత్తిడి దరి చేయకుండా చూసుకోవడం మృణాళ్‌లో ఉన్న గొప్ప విషయం. అద్భుత  విజయం సాధించినందుకు మృణాల్‌ను మేము అభినందిస్తున్నాం. ఉన్నత విద్యలో మరింత రాణించి మెడిసిస్‌లో కెరీర్‌ సాగించాలని ఆకాంక్షిస్తున్నాం” అన్నారు.


ఆకాశ్‌లో  తనను  ఏ మాత్రం ఒత్తిడి చేయకుండా చదువుల్లో తన పనితీరు మెరుగుపరుచుకునేలా చూసిన మెంటార్స్‌, టీచర్స్‌కు మృణాళ్‌ ధన్యవాదాలు తెలిపాడు. రోజు విడిచి ఆకాశ్‌లో రాసిన మాక్‌ టెస్టులు నీట్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌ రాసేందుకు తనలో తగిన విశ్వాసాన్ని పెంచాయని అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఉద్యోగులకు ఉపశమనం: దేశంలోనే మొదటిసారిగా డబ్ల్యూఎఫ్ హెచ్‌టీ సెంటర్లు