Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి చెప్పినా మొండికేస్తున్న డైరెక్టర్... రంగంలోకి దిల్ రాజు..?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:47 IST)
వినయ విధేయ రామ. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై భారీ ఫెయిల్యూర్‌ను సాధించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్ కాస్తా ఈ సినిమాతో తగ్గిపోయిందని ఓపెన్‌గా మాట్లాడుకున్నవారు లేకపోలేదు. సినీ విశ్లేషకులు సైతం సినిమాపై పెదవి విరిచారు. సినిమాను కొన్న బయ్యర్లైతే తల పట్టుకున్నారు.
 
అయితే తన కుమారుడు తీసిన సినిమా ఫెయిల్ కావడం చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు. అంతేకాదు సినిమాను ఎవరైతే కొన్నారో బయ్యర్లు వారికి డబ్బులు తిరిగి ఇచ్చేవాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారట. మొత్తం రూ.30 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలని చిరంజీవి నిర్ణయానికి వచ్చారట. రామ్ చరణ్‌ రూ.5 కోట్లు, నిర్మాత దానయ్య రూ. 10 కోట్లు,  మరో రూ. 5 కోట్లు దర్శకుడు బోయపాటి శ్రీను ఇవ్వాలని చిరంజీవి చెప్పారట.
 
అయితే బోయపాటి శ్రీను మాత్రం తాను డబ్బులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడట. తను చిత్రీకరించిన కొన్ని సీన్లపై సినిమాలోని యూనిట్ సభ్యులు, అందులోను నిర్మాత దానయ్య తప్పుడు ప్రచారం చేశాడని, అది తనకు బాగా బాధ కలిగిందని తన స్నేహితులతో వాపోయాడట. దీంతో చిరంజీవి రంగంలోకి దిగి బోయపాటి శ్రీనుకు నచ్చజెప్పేందుకు దిల్ రాజును పంపారట. 
 
అంతేకాదు అల్లు అరవింద్‌ను కూడా బోయపాటితో ఫోన్ చేయించి ఆ సమస్య సద్దుమణిగేలా చూడాలని కోరాడట. తనపై చిరంజీవి నమ్మకం పెట్టడంతో దిల్ రాజు బోయపాటి శ్రీనుతో మాట్లాడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి దిల్ రాజు చెప్పే మాటలకు బోయపాటి శ్రీను శాంతిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments