Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (11:39 IST)
చియాన్ విక్రమ్ తనయుడు, యువకుడు ధృవ్ విక్రమ్‌తో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తున్నట్టు కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఓ ప్రైవేట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ స్థానిక పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
మరోవైపు, వీరిద్దరూ బైసన్ సినిమాలో నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధృవ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇందులో అనుపమ ఆయన ప్రియురాలి పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫోటో ఆ సినిమాకు సంబంధించినదే అయి ఉంటుందని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. 
 
కాగా కేరళ రాష్ట్రానికి చెందిన అనుపమ పరమేశ్వరన్... 'ప్రేమమ్' చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చి, తన తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు. ఆ తర్వాత "అ.. ఆ..." అనే చిత్రంలో నటించి తెలుగు వెండితెరకు పరిచయమై వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. గత యేడాది ఆమె నటించిన "టిల్లు స్క్వేర్" మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె పరదా అనే తెలుగు సినిమాతోపాటు పలు మలయాళం, తమిళ ప్రాజెక్టులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments