Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో అనేక టార్చర్లు ఉంటాయ్.. అయినా ఇష్టమే : అనూ ఇమ్మాన్యుయేల్

తెలుగు తెరకు పరిచయమైన కొత్తకారు హీరోయిన్లలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. పైగా, 'మజ్ను', 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాలతో ఈ సుందరి హిట్స్ రుచి చూసింది. ఈమె సినీ ఇండస్ట్రీలో రాణింపుపై స్పందిస్తూ.. చిత్ర

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (14:58 IST)
తెలుగు తెరకు పరిచయమైన కొత్తకారు హీరోయిన్లలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. పైగా, 'మజ్ను', 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాలతో ఈ సుందరి హిట్స్ రుచి చూసింది. ఈమె సినీ ఇండస్ట్రీలో రాణింపుపై స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమలో రకరకాల వేధింపులు ఉంటాయనీ, అయినప్పటికీ ఈ రంగంలో కొనసాగేందుకు తనకు ఇష్టమేనని చెప్పింది.
 
చిత్రపరిశ్రమలో రాణించడం అంత తేలికైన విషయం కాదనీ, ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారనీ, ఒక్కొక్కరినీ ఒక్కోలా ట్రీట్ చేయాల్సి వస్తుంటుందని చెప్పింది. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రొఫెషన్ అంటే తనకి ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. 
 
కథలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టమని చెప్పింది. అదేవిధంగా అనుకూలంగా లేని షెడ్యూ‌ల్‌ను అనుసరించడం కూడా చాలా ఇబ్బందేనని చెప్పింది. ఇక షూటింగ్స్ వల్ల కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉండటం మరీ కష్టమని చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఈమె ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments