Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్, త్రివిక్రమ్‌లకు కీర్తి క్లాస్... అలా ఒప్పుకోకపోతే పోతానంటోందట...

తెలుగు ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మలయాళ భామల హవా పెరిగిపోయింది. నయనతార, సమంత, నిత్యామీనన్, సాయిపల్లవి ఇలా చాలామంది హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీని ఏలుతున్నారు. కీర్తి సురేష్‌ కూడా మళయాళం నుంచి వచ్చి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు స

Advertiesment
పవన్, త్రివిక్రమ్‌లకు కీర్తి క్లాస్... అలా ఒప్పుకోకపోతే పోతానంటోందట...
, మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:51 IST)
తెలుగు ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మలయాళ భామల హవా పెరిగిపోయింది. నయనతార, సమంత, నిత్యామీనన్, సాయిపల్లవి ఇలా చాలామంది హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీని ఏలుతున్నారు. కీర్తి సురేష్‌ కూడా మళయాళం నుంచి వచ్చి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించేసుకుంది. నేను శైలజ సినిమాలో రామ్‌తో కలిసి నటించిన కీర్తి సురేష్‌ ఆ తరువాత కొన్ని సినిమాల్లో చేసి అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. 
 
కీర్తి సురేష్‌ పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అతి తక్కువ కాలంలో కమర్షియల్ యాడ్‌లలో నటించిన ఈ సుందరి అగ్రహీరోలతో కలిసి పనిచేయడం అటు తెలుగు, ఇటు తమిళ బాషల్లో కీర్తి సురేష్‌ ముందుకు వెళుతుండడం సినీవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 
 
అవకాశాలు లేకపోయినా ఫర్వాలేదు కానీ కురచ దుస్తులు నటించి సినిమాలు చేయడం కీర్తి సురేష్‌కు ముందు నుంచి అస్సలు ఇష్టం లేదు. దీంతోపాటు మరికొన్ని షరతులను డైరెక్టర్లకు పెట్టిందట కీర్తి సురేష్‌. అదే ముసలి హీరోలతో అస్సలు నటించనని. దీంతో 15 సినిమాల అవకాశాలను కీర్తి పోగొట్టుకుందట. ఎన్ని సినిమాలు పోయినా ఫర్వాలేదు నా పాలసీ నాదే అంటోంది ఈ మలయాళ భామ.
 
ఒక్క సినిమాకు 2.5 కోట్ల రెమ్యునరేషన్ మాత్రం తీసుకుంటోందట. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గని కీర్తి సురేష్‌ పరిధి మాత్రం దాటి నటించనని చెబుతోందట. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో కురచ దుస్తులు ధరించాల్సి వస్తే ఆ సినిమా షూటింగ్ నుంచి బయటకు వచ్చేస్తానని డైరెక్టర్ త్రివిక్రమ్‌కు తేల్చి చెప్పేసిందట. త్రివిక్రమ్ రాసుకున్న కథకు సరిగ్గా సరిపోయే అమ్మాయి కీర్తి సురేష్‌ కావడంతో ఎన్ని కండిషన్లు పెట్టినా త్రివిక్రమ్ ఒకే అనేస్తున్నారట. సెట్స్ మీదకు పవన్ సినిమా వెళ్ళకముందే కీర్తి పెట్టిన కండిషన్లు ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా బాగా లేకపోతే తిడతా - బాలక్రిష్ణకు షాక్.. పళ్లు నూరుతున్న నట సింహం