Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ పుష్ప గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్, యాంకర్ సుమ నటిస్తుందట

Webdunia
మంగళవారం, 26 మే 2020 (14:41 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. బన్నీ ఇందులో చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడనున్నాడు. ఇప్పటి వరకు చేయని విధంగా ఊర మాస్ క్యారెక్టర్లో బన్నీ నటిస్తుండడం.. ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
ఈపాటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యుండాలి కానీ.. కరోనా వలన షూటింగ్‌కి బ్రేక్ పడింది. 
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ప్రభుత్వం షూటింగ్స్‌కి అనుమతి ఇచ్చినా.. బన్నీ మాత్రం జులై నుంచి కానీ ఆగష్టు నుంచి కానీ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడని తెలిసింది. అయితే... బన్నీ ఆగష్టు నుంచి షూటింగ్‌లో జాయిన్ అయినా జూన్ జులైలో మాత్రం బన్నీ లేని సీన్స్‌ని చిత్రీకరించాలి అనుకుంటున్నారని టాక్.
 
ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. ఎన్నడూ లేని విధంగా యాంకర్ సుమ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన బన్నీ ఫస్ట్ లుక్ చూస్తేనే, చిత్తూరు జిల్లాలో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు అని తెలుస్తోంది. ఇందులో బన్నీ ఎర్ర చందనాలు స్మగ్లింగ్ చేసే పాత్రలో, లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ విషయంలో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇపుడు కొత్తగా యాంకర్ సుమ ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉందని తెలిసింది. ఇంతకీ ఏ క్యారెక్టర్లో అంటే... సుమ అల్లు అర్జున్‌కు సోదరిగా నటించనున్నారు అని అంటున్నారు. మరి.. నిజంగానే సుమ బన్నీ పుష్ప సినిమాలో నటిస్తుందా లేదా అనే క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments