Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ- కో-డైరెక్ట‌ర్ మ‌ధ్య వివాదం... త్రివిక్ర‌మ్ మూవీ షూటింగ్ వాయిదా...

Webdunia
శనివారం, 20 జులై 2019 (20:15 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్- హారిక- హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. సెట్లో బ‌న్నీ కో-డైరెక్ట‌ర్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది అనేది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  అస‌లు ఏం జ‌రిగింది..?
 
ఈ గొడ‌వ గురించి ఆరా తీస్తే... బ‌న్నీకి కో-డైరెక్ట‌ర్ వ‌చ్చి మూడు రోజులు షూటింగ్ లేద‌ని చెప్పాడ‌ట‌. అంతే... బ‌న్నీకి కోపం వ‌చ్చి సీరియ‌స్ అయ్యాడ‌ట‌. విష‌యం ఏంటంటే.. బ‌న్నీ అమెరికా వెళ్లాలి అనుకున్నాడ‌ట. కానీ.. షూటింగ్ ఉంద‌ని క్యాన్సిల్ చేసుకున్నాడ‌ట‌. దీంతో అస‌లు ఆ టైమ్‌లో షూటింగ్ లేద‌ని చెప్ప‌డంతో... కో-డైరెక్ట‌ర్ పైన సీరియ‌స్ అయ్యాడ‌ట‌. ఆ కో-డైరెక్ట‌ర్ బాగా సీనియ‌ర్ అట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుల సంఘంలో ఫిర్యాదు చేయాలి అనుకున్నాడ‌ట‌.
 
కానీ... అల్లు అర‌వింద్ ఈ విష‌యాన్ని అంతదూరం వెళ్ల‌కుండా కామ్ చేసార‌ని తెలిసింది. అయితే... అలా అలా ఈ గొడ‌వ గురించి మీడియాకి తెలియ‌డంతో వార్త‌లు రావ‌డం.. హాట్ టాపిక్ అవ్వ‌డం జ‌రిగింది. కూల్‌గా ఉండే బ‌న్నీ... టెక్నీషియ‌న్ మీద ఇలా సీరియ‌స్ అవ్వ‌డం ఏం బాగాలేదు అంటూ మిగిలిన టెక్నీషియ‌న్స్ అర‌వింద్ గారి దృష్టికి తీసుకువ‌చ్చార‌ట‌. అదీ.. మ్యాట‌ర్..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments