Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారా.. జ‌గ‌తిని జ‌యించుదాం.. గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్.!

Webdunia
శనివారం, 20 జులై 2019 (20:07 IST)
నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేశారు. 
 
'రారా.. జగతిని జయించుదాం...' 
అనంత శ్రీరామ్‌ రచించిన 'రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..' అంటూ సాగే పాటను అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత నేతృత్వంలో పృథ్వీచంద్ర, బాషెర్‌మాక్స్‌ ఆలపించారు. ఈ పాటలోని ర్యాప్‌ను కూడా బాషెర్‌మాక్స్‌ క్రియేట్‌ చేశారు. చక్కని పదాలతో అనంతశ్రీరామ్‌ రాసిన ఈ పాట అందర్నీ ఇన్‌స్పైర్‌ చేసేలా ఉంది. దానికి తగ్గట్టుగానే సింగర్స్‌ ఇద్దరూ అద్భుతంగా ఆలపించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌ మెస్మరైజ్‌ చేసేలా ఉంది. 
 
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments