Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో వున్నాను.. అడవి శేష్

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (22:37 IST)
టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో అడవి శేష్ ఒకరు. ఆయన ఎప్పుడు ఒక ఇంటి వాడు అవుతాడా అని సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడవి శేష్ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తను ఇంతకుముందు పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదని.. ప్రస్తుతం పెళ్లి గురించి యోచిస్తున్నట్లు తెలిపాడు.
 
అంతేగాకుండా.. తను ప్రస్తుతం ఓ యువతితో డేటింగ్‌లో ఉన్నానని వెల్లడించాడు. ఆ అమ్మాయిది హైదరాబాదేనట. తను ఎవరో? ఏం చేస్తుందో? అనే విషయాలు సమయం వచ్చినప్పుడు చెబుతా.. అని ఆ విషయాన్ని సస్పెన్స్‌గా పెట్టేశాడు.  తన పెళ్లి గురించి తనకంటే ఎక్కువగా తన ఫ్యామిలీ మెంబర్స్ తొందరపడుతున్నారని.. ఎలాగైనా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావాలని తనను ఒత్తిడి చేస్తున్నారన్నాడు.  
 
అడవి శేష్ సినిమాల సంగతికి వస్తే.. మేజర్ అనే సినిమాలో అతను నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆర్మీ మేజర్ రోల్‌ను పోషిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. అలాగే నాని నిర్మాణంలో వస్తున్న హిట్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments