Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్‌లో చెమటలు చిందిస్తున్న రష్మిక.. కారణం ట్రైనరేనా? (Video)

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (11:26 IST)
తెలుగులో అనతి కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన్నా. 'ఛలో' మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ.. "గీతగోవిందం" చిత్రంతో పాపులర్ అయింది. పైగా ఈమె, తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా, టాప్ రేంజ్‌ని అందుకుంది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అందుకే సొగసైన బాడీ షేప్ కోసం చెమటలు చిందిస్తోంది. తాజాగా ఈ అమ్మడు జిమ్‌లో చేసిన బ్యాక్ ఫ్లిప్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోని 'ఛలో' బ్యూటీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
నిజానికి రష్మిక ఇప్పటికే నాజూకు సొగసులు ఉన్న ముద్దుగుమ్మ. అయినా జిమ్‌లో చెమటలు చిందించడానికి ఓ కారణం ఉందట. ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ కెరీర్ చాలా కొద్ది రోజులే. వీలైనంత ఫిట్‌గా లేకుంటే కెరీర్ ఎప్పుడైనా ప్రమాదంలో పడిపోవచ్చు. 
 
ఆ విషయం గుర్తించే రష్మిక పూర్తి ఫిట్నెస్‌తో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటోందట. సమంత లాంటి సీనియర్ హీరోయిన్స్ ఫిట్నెస్ కారణంగానే లాంగ్ టైం కెరీర్ లీడ్ చేస్తోన్నారు. అందుకే ఈ కన్నడ కస్తూరి కూడా అదే బాటలో పయనిస్తోందట. ఇందుకోసం రష్మిక ట్రైనర్ తనవంతు సాయం చేస్తున్నాడట. జిమ్‌లో చెమటలు పట్టేంతవరకు వదిలిపెట్టడం లేదట. మొత్తంమీద రష్మిక కూడా జిమ్‌లో ముమ్మర కసరత్తులు చేస్తోందన్నమాట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments