Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు షర్మిల నిరుద్యోగ దీక్ష : రేపటి నుంచి పోడు యాత్ర

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:46 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడి... కేసీఆర్ సర్కారుపై పోరాటం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, పలు జిల్లాల్లో నిరుద్యోగ దీక్షలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆత్యహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. జిల్లాలోని సోమ్ల తండాలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు.
 
అనంతరం అదే జిల్లాలోని గుండెంగి గ్రామంలో ఆమె ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఆ తర్వాత రాత్రి వరంగల్‌లో బసచేయనున్నారు. రేపు పోడు భూములపై పోరాటాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా లింగాల గ్రామంలో పోడు యాత్రను నిర్వహించనున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రానికల్లా హైదరాబాదుకు చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments