Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారిని కూడా వదలని వైకాపా సర్కారు : రఘురామరాజు

శ్రీవారిని కూడా వదలని వైకాపా సర్కారు : రఘురామరాజు
, గురువారం, 12 ఆగస్టు 2021 (16:15 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి వైఎస్.షర్మిల పాత్ర కూడా ఉందన్నారు. వైసీపీ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని, గొప్పగా ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని అన్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని సూచించారు. వైసీపీ విజయంలో సగం పాత్రను పోషించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వడమే సముచిత న్యాయమన్నారు. 
 
వైసీపీ విజయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని చెప్పారు. న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన అంబటి స్వతహాగా మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి అని అన్నారు. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలని రఘురామ సూచించారు.
 
మరోవైపు, ఫిరాయింపు అంశంపై తమ ఎంపీలు న్యాయశాఖ మంత్రిని కలిశారని, ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని వారు మంత్రిని కోరారని తెలిపారు. కానీ, ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను తాను ఉల్లంఘించలేదని రఘురామ స్పష్టం చేశారు. 
 
అటు, తమ ఎంపీలు హైకోర్టును కర్నూలుకు మార్చాలని కూడా మంత్రికి విన్నవించారని వివరించారు. అయితే, పార్టీ హెడ్ క్వార్టర్స్ మార్చినంత త్వరగా కోర్టును మార్చుతారా? అని రఘురామ ప్రశ్నించారు.
 
వైసీపీ సర్కారు తిరుమల శ్రీవారిని కూడా వదలడంలేదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇకపై సాలీనా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్‌లో నిర్ణయించారని వెల్లడించారు. 
 
పరిస్థితి చూస్తుంటే స్వామివారి నగలను సైతం విక్రయిస్తారేమోనన్న సందేహాలు వస్తున్నాయని తెలిపారు."ఈ ప్రభుత్వం ఇకనైనా మా దేవుడ్ని వదిలేయాలి. తిరుమల వెంకన్న ఆస్తుల జోలికి వెళ్లవద్దంటూ భక్తులందరం కలిసి సీఎంకు వినతి పత్రం పంపుదాం" అని రఘురామ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మూడో వేవ్: 300 మంది పిల్లలకు కోవిడ్ పాజిటివ్