Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేతో రాజీనామా చేయించండి : వైఎస్.షర్మిల

Webdunia
శనివారం, 24 జులై 2021 (09:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల మరోమారు విమర్శలు గుప్పించారు. తెరాస ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై ఆమె స్పందించారు. 
 
టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ అంగీకరించారని షర్మిల అన్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకాన్ని తీసుకొస్తాం తప్ప… ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషమంటూ ఆమె సెటైర్లు వేశారు. 
 
జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నామని ఇప్పటికైనా చెప్పినందుకు సంతోషమని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని, ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని… ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని షర్మిల సూచించారు. 
 
అందువల్ల మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలంటూ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఉపఎన్నికలు వస్తే కేసీఆర్ దృష్టి మీ ప్రాంతంపై పడుతుందని, ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలను తీసుకొస్తారని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక హామీలను మళ్లీ మూలకు పడేస్తారని షర్మిల విమర్శించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments