Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోస్టుల‌న్నీ భర్తీ చేయ్, పెద్ద మొగోడు అనుకుంటా: కేటీయార్ పైన ష‌ర్మిలా కామెంట్

పోస్టుల‌న్నీ భర్తీ చేయ్, పెద్ద మొగోడు అనుకుంటా:  కేటీయార్ పైన ష‌ర్మిలా కామెంట్
, శుక్రవారం, 16 జులై 2021 (21:36 IST)
తెలంగాణా సీఎం కేసీయార్, ఆయ‌న కొడుకు మంత్రి కేటీయార్ పైన వై.ఎస్. ష‌ర్మిల ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. లోటస్ పాండ్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ గడ్డపై కొత్త పార్టీని స్థాపించామ‌ని, ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాల‌ని త‌న‌దైన శైలిలో కామెంట్ చేశారు.

విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చేశారు... ఎంతో మందికి మేలు చేశారు... వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాద‌ని ఆమె సెల‌విచ్చారు. ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పార‌ని, యుపిఎ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు పై ప్ర‌పోజ‌ల్ పెట్టార‌ని, ఇపుడు వైఎస్సార్ చనిపోయిన తర్వాత మా గతి ఏమౌతాద‌ని ఇక్కడి ప్రజలు భయపడుతున్నార‌ని ష‌ర్మిల అన్నారు.

తెలంగాణ ప్రజలను వై.ఎస్. త‌న గుండెల్లో పెట్టుకుని చూశార‌ని చెప్పుకొచ్చారు. చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు. పాల్గొనని వారు తెలంగాణ అంటే ఇష్టం లేదని కాదు. మేం తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పలేదు. ఇది నా గడ్డ.. దీనికి మేలు చేయడానికి వచ్చాను. అని ష‌ర్మిల చెప్పారు. పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు...తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని... వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించాం అని చెప్పారు. త‌న పార్టీని అవమానిస్తే వైఎస్సార్ ను అవమానించినట్లే అని షర్మిలా చెప్పారు.  
 
కృష్ణ, గోదావరి బోర్డుల మీటింగ్ లను కేసీఆర్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేద‌ని, కేసీఆర్ అన్ని విషయాలను పెద్దగా తీసుకోరు కాబట్టే, కేంద్రం ఈ గెజిట్ విడుదల చేసింద‌న్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల‌ని, అలాగే చేస్తారని భావిస్తున్నాని, అది ఏ న‌ది అయినా, ఒక్క చుక్క నీటి బొట్టును తెలంగాణ వదులుకోద‌న్నారు. అలాగే, ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్క నీటి చుక్కను తీసుకోమ‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. కేంద్రం గెజిట్ పై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్పందిస్తామ‌న్నారు.
 
ఏపీలో రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లునే కనిపిస్తోంద‌ని, సీఎం అంటే సీఎం కాదు. కామన్ మ్యాన్ అని షర్మిల కొత్త అర్ధం చెప్పారు. కేటీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ గారి కొడుకా... కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదు. కేటీఆర్ కు అంతే... కేటీఆర్ దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో వంటలు చేసుకోవాలా? వ్రతాలు చేసుకోవాలా? మ‌రి కేటీఆర్ పెద్ద మొగోడు కదా... మహిళలు, నిరుద్యోగులకు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో 3.85 వేల ఖాళీలను భర్తీ చేయాలి. పెద్ద మొగోడు సాధించాడు అనుకుంటాను....అని ముక్తాయింపు ఇచ్చారు ష‌ర్మిలా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవాల‌య భూములు హిందువుల‌కే చెందుతాయి: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు