Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్ర‌మాదంలో యువ‌తి మృతి: పార్టీలో ఎంజాయ్.. వేగంగా కారు నడపటంతో?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (18:38 IST)
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌కు చెందిన ఆశ్రిత అనే అమ్మాయి కెనడాలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే నగరానికి వచ్చిన ఆమె ఆదివారం ఫ్రెండ్ షిప్‌డే కావడంతో తన స్నేహితులైన అభిషేక్, సత్య ప్రకాష్, తరుణిలతో కలిసి వేడుకల్లో పాల్గొంది. వీరంతా అర్ధరాత్రి వరకు పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ బ్యాచ్‌లోని ముగ్గురు అబ్బాయిలు మద్యం సేవించారు. ఇంటి కెళ్లే క్రమంలో అభిషేక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మద్యం మత్తు పైగా అతివేగంతో కారు నడపడం వల్ల గచ్చిబౌలి బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది.
 
ఆ ప్రమాదంలో ఆశ్రిత అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆశ్రిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనతో ఆశ్రిత కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments