పేరుకి కృష్ణా జిల్లా కేంద్ర నగరం, ఇక్కడ ఉండాల్సిన జిల్లా అధికారులు అందరూ వున్నా ఈ పట్టణంలో ఏమి జరుగుతోందో పట్టించుకునే వారే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినా, రోడ్ల మార్జిన్‌ల మీదే పక్కా కట్టడాలు నిర్మించిన ప్రభుత్వం నిర్మించేవి ఏవైనా పక్కకు జరిగి వెళ్తాయి గాని పక్కాగా కట్టిన వాటిని నిర్మూలనకు ముందుకురాని అధికారుల ఉదారత్వానికి ప్రజలు కధలుకధలుగా చెప్పుకుంటారు.
ఇటీవల వచ్చిన ఒక ఎస్పీ తప్ప రోడ్ల ఆక్రమణలు, విచ్చలవిడిగా తిరిగే పశువులను గురించి పట్టించుకున్నవారులేరని, నూతన ఎస్పీ గారి స్పందనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రోడ్లు భవనాల పర్యవేక్షణలో ఉన్న నగరంలోనే అతి కీలకమైన ప్రధాన రహదారిని బెల్ గెస్ట్ హౌస్ట్ రోడ్‌కి ఎదురుగా అంత పొడవున పగలగొట్టి అరకొరగా పూడ్చటంతో ఏర్పడిన గోతిలో అక్కడ గొయ్యి ఉందని తెలియని ద్విచక్ర వాహనంపై వచ్చే వారు తరచూ పడిపోవడం, వేగంగా వచ్చే నాలుగు చక్రవాహనాలు, బస్ లు ఆకస్మికంగా దిగిపోవటంతో లోపలి వారికి దెబ్బలు, వాహనాలు పడటం జరుగుతున్నా పట్టించుకున్న వారులేరు.
ఆ రోడ్‌ని డబ్బు చెల్లించి పగలకోడితే సరిగా వేయని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, ఒకవేళ పర్మిషన్ లేకుండా పగలగొడితే ఎవరో ఆచూకీ తెలుసుకుని కేసు నమోదు చేయాలని ప్రజలు ముఖ్యంగా బాధితులు కోరుతున్నారు.