Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రేయసిని ప్రేమిస్తున్నాడనీ యువకుడి కిరాతక చర్య

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (11:18 IST)
మాజీ ప్రియురాలిని ప్రేమించడమేకాకుండా తనపైకి రెచ్చగొడుతున్నాడన్న అక్కసుతో ఓ యువకుడిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన చాంద్రాయణగుట్టలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ సలాలా ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహమాన్ బాక్రా (24) అనే యువకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే మసీదుల్లో నమాజులు కూడా చదివిస్తుంటాడు. ఈయన ఓల్డ్ సిటీలో నివాసం ఉండే ఓ అరబ్ యువతిని ప్రేమించాడు. అయితే, కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారు దూరమయ్యారు. 
 
ఈ క్రమంలో ఆ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ ట్రావెల్ కన్సల్టెంట్‌ నిర్వాహకుడు షేక్ అబూబాకర్ అమూదీ (24)ని ప్రేమించింది. అతడికి మరో యువతితో వివాహమైనప్పటికీ ఈ యువతితో ప్రేమను కొనసాగిస్తూ వచ్చాడు. వివాహమైన విషయం యువతికి తెలిసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని తన మాజీ ప్రియుడిని ఒత్తిడి చేయసాగింది. అమూదీ వల్లే తన మాజీ ప్రియురాలు ఇలా చేస్తుందని భావించిన బాక్రా కోపంతో రగిలిపోయాడు. 
 
అతను మాజీ ప్రియురాలిని ప్రేమించి, మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడమే కాకుండా తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఆమెతో ఒత్తిడి చేస్తున్నాడని ఆగ్రహంతో రగిలిపోయాడు. అక్కడితో ఆగక అమూదీని హత్య చేయాలని పథకం రచించాడు. 
 
మాట్లాడుకుందామని రమ్మని శనివారం పిలిచాడు. ఆ రోజు అర్థరాత్రి తర్వాత కారులో వచ్చిన అమూదీని రహమాన్ తన బంధువు ఇంటికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కత్తితో పొడిచి, అక్కడ నుంచి నేరుగా స్టేషన్‍‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments