Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశారు

Advertiesment
Godfather,
, సోమవారం, 22 ఆగస్టు 2022 (07:58 IST)
Godfather,
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒకరోజు ముందుగానే పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' టీజర్ ని తెలుగు, హిందీలో విడుదల చేశారు నిర్మాతలు. టీజర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార , సత్య దేవ్‌తో సహా ఇతర ప్రముఖ పాత్రలను  పవర్ ఫుల్ గా పరిచయం చేశారు.
 
 ''ఇరవై ఏళ్ళు ఎక్కడి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. సడన్ గా తిరిగొచ్చిన ఆరేళ్ళలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు''.
''ఇక్కిడికి ఎవరొచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు''
'' డూ యు నో హూ హి ఇస్ ? హిఈజ్ ది బాస్ అఫ్ ది బాసస్. అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్''
టీజర్ బ్యాగ్రౌండ్లో వినిపించిన ఈ డైలాగ్స్ తర్వాత గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ ఎంట్రీ  ఇవ్వడం పవర్ ప్యాక్డ్ గా ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది.
 
తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ కు కుడి భుజంగా భారీ యాక్షన్ తో ఎంట్రీ ఇవ్వడం మరింత క్యురియాసిటీని పెంచేసింది. “లగ్ రహా హై బడి లంబీ ప్లానింగ్ చల్ రహీ హై. అప్నే ఇస్ ఛోటే భాయ్ కో భూల్ నా నహీ.. కహే తో ఆజాతా హూ మై...” అంటూ గాడ్ ఫాదర్‌కి  మద్దతు తెలపగా.. ''వెయిట్ ఫర్ మై కమాండ్' అని చెప్పడం ఇంట్రస్టింగా వుంది.
 
టీజర్‌లోని ప్రతి సీక్వెన్స్ అద్భుతమైన ఎలివేషన్‌తో మెగా థ్రిల్ పంచాయి. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్‌గా అదరగొట్టారు. మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఆకట్టుకుంది. స్టైలిష్‌గా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ బ్లాక్‌లు  బ్రిలియంట్ గా వున్నాయి.
టీజర్ చివర్లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ జీపులో కలిసి రావడం మెయిన్ హైలైట్. ముందుగా చెప్పినట్లుగా ఇది చిరంజీవి అభిమానులకు, సినీ అభిమానులకు  అడ్వాన్స్ మెగా బర్త్ డే ప్రజంటేషన్. సల్మాన్ ఖాన్  ప్రజన్స్ ఒక బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఫాక్టర్ అని చెప్పాలి.
 
ఉన్నతమైన  నిర్మాణ విలువలు, నీరవ్ షా  అద్భుతమైన కెమెరా పనితనం, ఎస్ థమన్  బీజీఎం అవుట్ స్టాండింగ్ గా వున్నాయి.  దర్శకుడు మోహన్ రాజా అన్ని వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని టీజర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. టీజర్ సినిమాపై  భారీ అంచనాలను పెంచింది.
సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.
గాడ్ ఫాదర్ 2022 దసరా కానుకగా అక్టోబర్ న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా,  నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్,  సమర్పణ: కొణిదెల సురేఖ, బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్,  సంగీతం: ఎస్ ఎస్ థమన్, డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైగర్ కుమ్మేస్తుంది.. నేను గ్యారెంటీ.. ఆగస్టు 25న వాట్ లగా దేంగే: విజయ్ దేవరకొండ