Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని వల : ప్రాణాలు తీసుకున్న యువకుడు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమ పేరుతో తన స్నేహితురాలి సోదరుడుకి వలవు వల వేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుగ్గొండి మండలం లక్మిపురానికి చెందిన ఓ యువతి బీటెక్ చదువుతోంది. డబ్బులు సంపాదించాలనే ఆశతో తన స్నేహితురాలి అన్నకే వలేసింది. రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన తన స్నేహితురాలి అన్నకు ఫోన్ చేసింది. 
 
ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేస్తూ ముగ్గులోకి దించింది. అనంతరం ఆ ముగ్గురిలో ఓ యువతి పురుగుల మందు తాగి చనిపోయిందని బెదిరించి డబ్బులు లాగేయత్నం చేసింది. దాంతో భయపడిన యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments