Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరులో కలకలం : బీటెక్ అమ్మాయిని నడిరోడ్డుపై కత్తితో పొడిచిన.. .

Advertiesment
గుంటూరులో కలకలం : బీటెక్ అమ్మాయిని నడిరోడ్డుపై కత్తితో పొడిచిన.. .
, ఆదివారం, 15 ఆగస్టు 2021 (12:18 IST)
జిల్లా కేంద్రమైన గుంటూరులో కలకలం చెలరేగింది. ఓ బీటెక్ అమ్మాయిని క‌త్తితో పొడిచి చంపాడో యువ‌కుడు. గుంటూరు కాకాని రోడ్డులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని హ‌త్య ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
 
స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో ఆ అమ్మాయి బీటెక్ మూడో ఏడాది చ‌దువుతున్న‌ట్లు గుర్తించారు. యువ‌తిని ఆ యువ‌కుడు ప్రేమ పేరుతో వేధిస్తుండ‌గా, ఆమె తిర‌స్క‌రించ‌డంతోనే ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.
 
కాగా.. విద్యార్థిని మృతదేహాన్ని అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. నిందితుడి కోసం పోలీసులు నగరంలో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాం - మిజోరాం రాష్ట్రాల మధ్య మళ్లీచిచ్చు