Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎన్ని ప్రాణాలు బలైపోవాలి చెప్పండి? కేసీఆర్ పైన విజయశాంతి పైర్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:25 IST)
హైదరాబాద్ దీనదయాళ్ నగర్‌లో ఉన్న నాలాలో సుమేద అనే 12 ఏళ్ల విద్యార్థిని పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ కేసీఆర్ గారు మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పండి అని ప్రశ్నించారు.
 
అభంశుభం తెలియని చిన్నారి జీవితం కరిగిపోయిందని చెప్పారు. విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా డ్రైనేజిలు, నాలాలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్కతీస్తే గిన్నిస్ రికార్డ్ అవుతుందని విమర్శించారు.
 
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరక్కుండా చూస్తామని మాటలు చెప్పడం మామూలైపోయింది. పాత ప్రభుత్వాల వల్లే హైదరాబాదులో పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు విమర్శించారు, మరి ఈ ఆరేళ్ల పాలనలో మీరు చేసిందేమిటని ఎద్దేవా చేశారు.
 
ఇప్పుడు ఇతర తెలంగాణ పట్టణాలు, నగరాలు కూడా హైదరాబాదుకు తోడవుతున్నాయని అడుగడుగునా కబ్జాలు అక్రమ కట్టడాలతో చినుకు పడితే చాలు ఆ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments