Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతిపక్షమే మీడియా నోరు నొక్కేస్తోంది: రామకృష్ణా రెడ్డి

Advertiesment
ప్రతిపక్షమే మీడియా నోరు నొక్కేస్తోంది: రామకృష్ణా రెడ్డి
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:21 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకుండా కోర్టుకు వెళుతున్నారని, ప్రతిపక్షమే మీడియా స్వేచ్చను హరించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో అధికార పక్షం మీడియా స్వేచ్చను కాలరాసిందని విన్నామని, కానీ ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
 
అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పైన విచారణలో తొందరపాటు ఏమీ లేదని, తప్పులపై విచారణ జరపకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఏదైనా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అని అంటారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి భూములపై విచారణకు నియమించిన సిట్ స్వతంత్ర విచారణ సంస్థ అని సజ్జల స్పష్టం చేశారు.
 
టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వకేట్ జనరల్‌గా పదవి ఇచ్చారని అతనిపై ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటి ఆధారంగానే కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.ఇలాంటి పరిణామాలపై మీడియాలో కథనాలు రావొద్దంటూ న్యాయస్థానాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా నోరు నొక్కేయడం కొంచెం అతిగా అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌.. చైనా.. కానీ ప్రజలకు అదే పనిగా వేస్తే..?