Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవన్నీ అమరావతి భూములని చూపిస్తున్నారు, తప్పు: చినరాజప్ప

Advertiesment
అవన్నీ అమరావతి భూములని చూపిస్తున్నారు, తప్పు: చినరాజప్ప
, మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (18:27 IST)
వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు పెరిగిపోతున్నాయని టీడీపీ నేత మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.
 
విశాఖపట్నంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసిందని దీనిపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో సీఆర్డీఏ హద్దులకు అవతలి ఉన్న ప్రాంతాలలోని భూములను కూడా రాజధాని భూములుగా విష ప్రచారం చేస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు.
 
ఎంతసేపు టీడీపీ పాలనపై తప్పు పట్టడం, తమ పాలనలోని అవినీతిలను దాచి వైసీపీ తమపై బురద చల్లుతుందని విమర్శించారు. ప్రజల కోసం వైసీపీ చేసిందేమీ లేదని తప్పుపట్టారు. అమరావతి భూములపై విషప్రచారం చేయడం సరైన విధానం కాదని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగ్గిన శానిటైజర్ అమ్మకాలు, కరోనావైరస్ భయాన్ని గాలికి వదిలేసిన ప్రజలు