Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయలసీమ వారు నన్ను ఏమి చేయలేరు, రఘురామకృష్ణ రాజు

రాయలసీమ వారు నన్ను ఏమి చేయలేరు, రఘురామకృష్ణ రాజు
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (15:41 IST)
రాయలసీమలో కూర్చొని ఖబడ్దార్ రఘురామకృష్ణ రాజు అంటే ఎవరూ భయపడరు అని వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపి రఘురామకృష్ణారాజు తెలిపారు. రాయలసీమ వారు నన్ను ఏమి చేయలేరు, నా దిష్టిబొమ్మలు తగలబెట్టడం తప్ప అని ఎద్దేవా చేశారు. నన్ను బెదిరించడంతో పాటు నాతో సన్నిహితంగా మెలుగుతున్న ఎంపీలను సున్నితంగా బెదిరిస్తున్నారు అన్నారు.
 
ఫోన్లో మాట్లాడాలంటే కూడా ట్యాపింగ్ చేస్తున్నారేమో అనే భయం ఉందన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో రథానికి ఉన్న మూడు వెండి సింహాలు చోరికి గురవటం దురదృష్టకరం. హిందూ దేవాలయాల్లోనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి. సాయిబాబా గుడిలో విగ్రహం విరగగొట్టడం విచారకరం.
 
మంత్రి ఇంటికి పక్కనే ఉన్న దేవాలయాల్లో ఇలా దొంగతనాలు జరగడం బాధాకరం. 
దేవాలయాలపై దృష్టిపెట్టే మంత్రిని నియమిస్తే బాగుంటుందని రఘురామ కృష్ణ రాజు తెలియజేశారు. అమరావతి భూములపై వేసిన “సిట్” విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని రాష్ట్ర రాజధాని ప్రకటన తర్వాత, ఆ ప్రాంతంలో భూములు కొన్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు అని నిలదీశారు.
 
ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నాక అక్కడ భూములు కొనుక్కున్న వారి పరిస్థితి ఇప్పుడు ఏంటి? 
గత ప్రభుత్వం చేసింది “ఇన్ సైడర్ ట్రేడింగ్” అయితే,  మీరు చేస్తున్నది “అవుట్ సైడ్ ట్రేడింగ్” అనాలా? ప్రజలను నమ్మించి మోసం చేసిన నాయకులపై బాధితులు “సిట్” వేయమని అడగవచ్చా.
 
ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. రాజ్యాంగం ప్రకారం నన్ను అనర్హుడిగా ప్రకటించడం సాధ్యం కాదు. నన్ను అనర్హుడిగా ప్రకటించడం కోసం, రాష్ట్ర సమస్యలను తాకట్టు పెట్టొద్దు అన్నారు రఘురామకృష్ణ రాజు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టమైతే బడికి .. లేకుంటే ఇంట్లోనే.. కేంద్రం మార్గదర్శకాలు జారీ