Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కోర్టులో ఉద్యోగం.. కోపంతో ఊగిపోయిన భర్త.. ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:12 IST)
భార్యకు కోర్టులో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె భర్త మాత్రం కోపంతో రగిలిపోయాడు. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి తగల పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయితే ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అప్రమత్తమవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. నిందితుడు సురేశ్ రాజన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. కాగా.. ఆగస్టు 2 అతడి భార్య ఇఫ్షీబాయికి కోర్టులో ఉద్యోగం వచ్చింది.
 
అయితే.. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేని అతడు ఆమె కోపంతో రగిలిపోయాడు. ఆమెను వేధించడం ప్రారంభించిన అతడు ఇటీవల ఓ రోజు ఆమెను కూర్చీకి కట్టేశాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో ప్రాణ భయంతో వణికిపోయిన ఆమె.. పెద్ద పెట్టున కేకలు పెట్టండంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments