Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమజ్జనం సమయంలో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడండి : హైకోర్టు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (13:17 IST)
హైదరాబాద్ నగరంలో వినాయకచవితి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. అయితే, వినాయక విగ్రహాల నిమజ్జనం సమయం హుస్సేన్ సాగర్‌లో జరుగుతుంది. అయితే, హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈ నెల 6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.
 
ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని సూచించింది.
 
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. ప్రజల సెంటిమెంట్​ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా చూడాలని సూచింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేసింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని హైకోర్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం