Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవ‌ద్దు: హైకోర్టు ఆదేశం

Advertiesment
high court ordered not to take over sangam dairy by governmentసంగం డెయిరీని స్వాధీనం చేసుకోవ‌ద్దు:  హైకోర్టు ఆదేశం
విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:20 IST)
సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవ‌ద్దని ఏపీ ప్ర‌భుత్వానికి  హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశం ఇచ్చింది. సంగం డెయిరి స్వాధీనం కేసులో ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ రిట్ అప్పీల్ పై ఈరోజు తీర్పు వెల్లడించిన  ప్రధాన న్యాయమూర్తి ఆధ్వ‌ర్యంలోని ద్విసభ్య దర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఈ రిట్ అప్పీల్ లో ప్రైవేటు వ్యక్తులు వేసిన ఇంప్లీడ్ పిటీషన్ ను కోర్టు కోట్టివేసింది. 
 
ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడి రైతులు సాధించిన విజయం అని సంగం డెయిరి చైర్మన్ దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కుట్రలు, కుతంత్రాలను హైకోర్టు అడ్డుకుంద‌ని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపట్ల పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఒక్కసారి భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు