Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు జిల్లా నూతక్కి నుండి కుంచనపల్లి వరకు రోడ్డు విస్తరణ

గుంటూరు జిల్లా నూతక్కి నుండి కుంచనపల్లి వరకు రోడ్డు విస్తరణ
విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:05 IST)
గుంటూరు జిల్లా నూతక్కి నుండి కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును విస్త‌రిస్తున్నారు. దీనికి సి.ఆర్.ఐ.ఎఫ్ కింద 14 కోట్ల రూపాయలు మంజూర‌య్యాయ‌ని, దీనితో విస్తరణ ప‌నుల‌కు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ద‌గ్గ‌రుండి నిర్మాణ సంస్థ సూపర్ వైజర్ చేత శిలాఫలకం ప్రాంభింపచేశారు. 
 
అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, నూతక్కి నుండి వయా గుండిమెడ, ప్రాతురు గ్రామాల మీదుగా కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును 14 కోట్ల రూపాయలతో నిర్మించటానికి ఈ రోజు శంకుస్థాపన చేశామ‌న్నారు. అలాగే ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి సర్వే పనులు ఒక వారం రోజులలో పూర్తి చేసి గ్రామాల వద్ద అవసరమైన చోట సిసి డ్రైన్లు, కాల్వర్టులు నిర్మాణం కూడా చేస్తామ‌ని చెప్పారు. సంవత్సర కాలంలో రోడ్డు నిర్మాణం పూర్తి  చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారని అన్నారు. వీలైనంత త్వరగా, ఒక సంవత్సరం లోపల రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను కోరారు.
 
నూతక్కి, చిర్రావురు, గుండిమెడ, ప్రాతురు వంటి గ్రామాలలో వ్యవసాయ ఉత్పత్తులు విజయవాడ, మంగళగిరి రవాణాకు రైతులకు, ప్రజలకు చాలా అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. 
 
మంగళగిరి పాత బస్టాండ్ వద్ద నుండి పెద్దపరిమి వరకు 25 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం లెవిలింగ్ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే రెవేంద్రపాడు నుండి తాడేపల్లి బైపాస్ రోడ్డు కట్ట వరకు రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రాంభించటానికి రెడీగా ఉన్నారని అన్నారు. మొత్తంగా ఈ 3 రోడ్లు చాలా ప్రధానంగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూచిపూడి నృత్య భంగిమ‌ల‌తో... కృష్ణా జిల్లా పోలీసు శాఖ కొత్త‌ లోగో!