Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: డెంగ్యూతో 45మంది మృతి.. చిన్నారులే అధికం

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:55 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగ్యూ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీ వద్ద చాలా హృదయవిదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న పిల్లలు హాస్పిటళ్లకు పోటెత్తుతున్నారు. చిన్న పిల్లలు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని, కొందరు డెంగ్యూ పరీక్షలో పాజిటివ్‌గా తేలుతున్నట్లు పీడియాట్రిక్‌ డాక్టర్ ఎల్‌కే గుప్తా తెలిపారు.
 
ప్రస్తుతం హాస్పిటల్‌లో 186 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ చంద్రా విజయ్ సింగ్ ఆదేశించారు. నిన్న ఫిరోజాబాద్ హాస్పిటల్‌ను సీఎం యోగి సందర్శించారు.
 
చాలా మంది పిల్లల్లో కీళ్ల నొప్పులు, తలనొప్పి, డీహైడ్రేషన్‌, మగత లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు పేషెంట్లలో కాళ్లు, చేతులకు ఎర్రటి దద్దులు వస్తున్నాయి. అయితే మరణించిన వారిలో ఎవరు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలలేదు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments