Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ అడ్డాలో సీఎం కేసీఆర్.. భారీ స్వాగత ఏర్పాట్లు

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (13:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రయాణించే మార్గంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ నెల 7వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడో విడత ఎన్నికల ప్రచారం జరుగనుంది. ఇందులో బీజేపీ వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సీఎం కేసీఆర్ వారణాసికి వెళ్లనున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. 
 
ఈ ఫ్లెక్సీల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, మాజీ ప్రధాని దేవేగౌడ, మంత్రి కేటీఆర్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారి ఫోటోలు ఉన్నాయి. "ఉత్తరప్రదేశ్ మీకు హార్థిక స్వాగతం పలుకుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ్ కా నేత కేసీఆర్ అని ఫ్లెక్సీలపై రాశారు. 
 
సీఎం కేసీఆర్ యూపీ ఎన్నికల ప్రచారం చేయడానికి కారణం లేకపోలేదు. ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఢిల్లీలో మకాం వేశారు. ఈ క్రమంలో ఫెడరల్  ఫ్రంట్ చర్చలు ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఉత్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments